HomeNews'మహాసముద్రం'.. మామూలు అదృష్టం కాదిది.!

‘మహాసముద్రం’.. మామూలు అదృష్టం కాదిది.!

Mahasamudram With Full Of Good Vibes | Telugu Rajyam

సిద్దార్ధ, శర్వానంద్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. విజయదశమికి ఒక్క రోజు ముందే థియేటర్లలో ‘మహాసముద్రం’ సందడి చేస్తోంది.

కరోనా నేపథ్యంలో తెలుగు సినిమా చాలా కష్టాలు ఎదుర్కొంటోంది. థియేటర్లు ఎలాగోలా తెరచుకున్నాయనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కారణంగా అక్కడ థియేటర్లలో ఆక్యుపెన్సీని కుదించడంతోపాటు, రోజువారీ ప్రదర్శనల సంఖ్య కూడా పరిమితమయ్యింది.

ఎలాగైతేనేం, రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం అమల్లోకి వచ్చాక విడుదలవుతున్న తొలి సినిమా ‘మహాసముద్రం’ కావడం విశేషమే మరి. అయితే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్ళి సందడి’ సినిమాల రూపంలో గట్టి పోటీ ‘మహాసముద్రం’కి ఎదురుకానుంది.

పండగ సీజన్ కదా.. ఎన్ని సినిమాల్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారనుకోండి. అది వేరే సంగతి. ఓవర్సీస్ రిపోర్టుల్ని బట్టి చూస్తే, ‘మహాసముద్రం’ సినిమాకి మంచి రివ్యూలే వస్తున్నాయ్.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News