బ‌న్నీచెల్లెలిగా కనిపించ‌నున్న గ్లామ‌ర‌స్ హీరోయిన్.. అభిమానులు ఖుష్‌

గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆగ‌స్ట్ 13న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తూర్పు గోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి గ్రామాల‌లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో కేరళ‌కు వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

పుష్ప సినిమాకు సంబంధించిన వార్తలు అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. ఇటీవ‌ల ఈ చిత్రం నుండి క్రేజీ అప్‌డేట్ రాగా, దీని ప్రకారం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ నటుడు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా వ‌చ్చిన వార్త‌పై ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

నితిన్‌తో క‌లిసి లై అనే సినిమాలో న‌టించిన మేఘా ఆకాశ్ ఈ చిత్రంలోని న‌ట‌న‌తో ఎంత‌గానో అల‌రించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పుష్ప చిత్రంలో బన్నీ చెల్లెలిగా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఇక పోలీస్ ఆఫీస‌ర్‌గా ప్ర‌ముఖ న‌టుడు క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న‌తో మేఘా ఆకాశ్ ల‌వ్వాయ‌ణం న‌డుపుతుంద‌ని అంటున్నారు. ఇక ఈ పోలీస్ ఆఫీస‌ర్ వ‌ల‌న మేఘా ఆకాశ్ చనిపోతుంద‌నే స‌మాచారం కూడా బ‌య‌ట‌కు లీకైంది. ప్ర‌తి పాత్ర ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తుంద‌ని, ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాక తమిళం, హిందీ, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను కూడా త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు. సుకుమార్ .. పుష్ప సినిమాను రంగ‌స్థ‌లం స్టైల్‌లోనే తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో చిత్తూరు యాస‌తో బ‌న్నీ అల‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.