Mohan Babu: మోహన్ బాబు గుర్తు పెట్టుకో.. ధన మదంతో అలా చేస్తే ఇలానే ఉంటది రిజల్ట్: జొన్న విత్తుల

Mohan Babu: విజయవాడలో తను రాసిన శతకం ప్రింటింగ్ జరుగుతున్నపుడు, అది లేట్ అవుతుందని తెలిసి, అప్పటివరకూ తానేం చేయాలని కాసేపు ఆలోచించి, ఢీ సినిమాకు సంబంధించి కొన్ని గొడవలయ్యాయి కదా, అదేంటో తెలుసుకుందామని ఆ సినిమా చూడడానికి వెళ్లానని ప్రముఖ సినీ గీత రచయిత జొన్న విత్తుల అన్నారు. అందరూ ప్రతీ సినిమానూ చూడలేరన్న ఆయన, అందులో మంచి లేదా చెడు జరిగిందని చెప్పగానే చూస్తారని, తాను కూడా మామూలు సినీ ప్రేక్షకుడినే అని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే టెక్నికల్‌గా ఆ సినిమా బాగా తీసినా, ఆ ఒక బ్రాహ్మణుడు చంఢీ హోమం చేయాలని అడిగే సీన్‌లో వాళ్లు రాము అనేసరికి సంభావన ఎక్కువ పడేస్తే వాళ్లే వస్తారు అనే డైలాగ్ వినగానే తనకు చాలా కోపం వచ్చిందని ఆయన అన్నారు. తోకాడిస్తూ రావడం అనటం ఏంటీ, వాళ్లు వేద పండితులు అని ఆయన చెప్పారు. అంటే ఒక బ్రాహ్మణుడిని వాళ్లు చూస్తున్నారు ? అని ఆయన ప్రశ్నించారు. వాళ్లేమో మీ మంచి కోసం ఆశీర్వదించాలి గానీ, నువ్వు మాత్రం ఇలాంటి డైలాగులు వేస్తావా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పోనీ అనుకుంటే ఒక వేద పండితుని ఇంటికి ఒక మేనేజర్ వచ్చే సన్నివేశంలో ఆమె ప్రతీ సారి మీరు మా ఆయన లాగానే ఉన్నారనే డైలాగులు తనకు అసహ్యాన్ని తెప్పించాయని, అసలు దీన్ని కామెడీ అంటారా అని ఆయన కోపం వ్యక్తం చేశారు.

అలా తాను వెళ్లి చూడగానే వాళ్లు బాధపడ్డ దాంట్లో తప్పేంలేదని తనకు అర్థమైనట్టు ఆయన చెప్పారు. దీన్ని ఓ టీవీ ఛానెల్‌లో చర్చ పెట్టినపుడు తాను వెళ్లి మాట్లాడానని, దాంతో వారి అభిమానులు తనను బెదిరించారని ఆయన తెలిపారు. సినిమా వాళ్లెవరూ రాకుండా తానొక్కడే మాట్లాడేసరికి తనపై కోపం వెళ్లగక్కారని ఆయన చెప్పారు. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఒక మగవాడిని చూసి మా ఆయనలా ఉన్నాడని అంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత మోహన్ బాబు గారితో ఎలాంటి టచ్‌లో లేనని, ఈ అంశం జరగడంతో ఆ ఇష్యూ చాలా పెద్దగా అయిందని ఆయన చెప్పారు. ఒక 2నెలల తర్వాత తన మీద పరువు నష్టం దావా కూడా వేశారని, దాని వల్ల తాను దాదాపు 5ఏళ్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అంటే దురహంకారంతో, మీ ధన మదంతో మీరు తప్పి చేసి, దాన్ని దిద్దు కోకుండా మళ్లీ రివర్స్‌లో దావా వేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.