లెఫ్టినెంట్ రామ్ ప్రేమలో పడిపోయా.. సీతారామం హీరోకు ప్రేమలేఖ రాసిన అభిమాని!

దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ భాషలలో విడుదల అయ్యి ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేశారు. హిందీలో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఏకంగా పోలాండ్ కు చెందిన ఒక అభిమాని ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పై ప్రేమను కురిపిస్తూ ఏకంగా నాలుగు పేజీల ప్రేమలేఖను రాశారు.

మౌనిక అనే అభిమాని ట్విట్టర్ వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ నాలుగు పేజీల ప్రేమలేఖ రాశారు. 2006 నుంచి తాను భారతీయ సంగీతానికి ఎంతో అలవాటు పడ్డానని తెలిపారు. ఈ క్రమంలోనే సీతారామం గురించి మాట్లాడుతూ ఈ సినిమా తనని ఎంతగానో ఆకట్టుకుందని, ఈ సినిమాని షారుఖ్ ఖాన్ నటించిన వీర్ జరా సినిమాతో పోల్చారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ తాను లెఫ్టినెంట్ రామ్ ప్రేమలో పడిపోయానని అతనిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. అతని పాత్ర ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారంటూ తెలియజేశారు.

ఇక సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ కాకుండా ఎవరిని ఊహించుకోలేమని ఆమె ఎంతో అద్భుతంగా నటించారని తెలిపారు.ఇక ఈమెకు వాయిస్ ఇచ్చినటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద లేకుంటే సీతామహాలక్ష్మి అసంపూర్ణం అంటూ ఈ చిత్ర యూనిట్ గురించి ఈమె నాలుగు పేజీల ప్రేమలేఖ రాశారు. ఇలా ఈమె రాసిన ఈ లేక పై నటుడు దుల్కర్ సల్మాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన రిప్లై ఇస్తూ.. అందమైన లేఖ మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మిమ్మల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నాము మా పట్ల మీరు గొప్ప అవగాహనతో రాశారు మీ ప్రతిభకు హాట్సాఫ్ అంటూ దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు.