దర్శకులు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా @ లవ్ టైటిల్ లోగో విడుదల !!!

ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న సరికొత్త చిత్రం ‘@లవ్’. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ మరియు డాక్టర్ మారుతి సకారం తదితరులు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ సినిమా టైటిల్ లోగోను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని.. అందులో భాగంగానే.. నేడు తాను ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు.

వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. TMS బ్యానర్ లో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ కలయికతో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మాతలుగా రూపొందించిన ఈ చిత్రంలో అందరూ నూతన నటీనటులు నటించారు. శ్రీనారాయణ దర్శకత్వంలో, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో పాటు ఆడజాతికి సంబంధించిన ఓ గొప్ప సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుందట. ఈ సినిమా మొత్తం ఆటవిక నేపథ్యంలో సాగడం విశేషం.

నటీనటులు: రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ, డా. మారుతీ సాకారామ్ తదితరులు.

నిర్మాతలు: మహేందర్ సింగ్, శైలజ తాటిచర్ల, శ్రీనారాయణ
రచన దర్సకత్వం: శ్రీనారాయణ
మ్యూజిక్: సన్నీ మానిక్, రామ్ చరణ్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కెమెరామెన్: మహేందర్
సౌండ్ డిజైన్: యతీరాజ్
పీఆర్ఓ: శ్రీధర్