కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన స్టార్ హీరో.. కేసు న‌మోదు చేసిన పోలీసులు

గ‌త ఆరేడు నెల‌లుగా క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిస్తున్న భీబ‌త్సం అంతా ఇంతా కాదు. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అంద‌రిని పొట్ట‌న పెట్టుకుంది. ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి కాస్త త‌గ్గుతుండ‌డంతో ప్ర‌భుత్వం అన్ని కార్య‌కలాపాలు స‌క్ర‌మంగా నిర్వ‌హించేందుకు వెసులు బాటు క‌ల్పిస్తుంది. సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే థియేట‌ర్స్ ఇంకా మూత‌ప‌డే ఉన్నాయి. ఎక్కడో ఓ చోట థియేట‌ర్స్ తెర‌వ‌గా, అక్క‌డ‌ పాత సినిమాల‌ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక షూటింగ్‌ల ద‌గ్గ‌ర కరోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు.

క‌రోనా నిబంధ‌న‌లు ఎవ‌రైన ఉల్లంఘిస్తే క‌ఠిన శిక్ష‌లు ఉంటాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌లుమార్లు హెచ్చరించ‌గా, కొంద‌రు మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా గాలికి తిరుగుతున్నారు. సామాన్యుల సంగ‌తి స‌రే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌కుండా, ముఖానికి మాస్ట్ లేకుండా అభిమానుల‌తో ఫోటోలు దిగాడు. దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్.. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పై యూపీ స్థానిక ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

మాస్క్ మరియు సామాజిక దూరం విషయాల్లో సామాన్యులకు అవగాహన‌ కల్పించాల్సిన స్టార్స్ కూడా వాటిని పాటించకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఎమ్మెల్యే నంద కిషోర్ ఆరోపణ. మేట‌ర్‌లోకి వెళితే అమీర్ ఖాన్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ట్రోనికా లో షూటింగ్ లో పాల్గొన్నాడు. అమీర్‌ని చూసేందుకు చాలా మంది అభిమానులు వ‌చ్చారు. వారిని నిరాశ‌ప‌ర‌చ‌కుండా ఫోటోలు దిగాడు. ఈ స‌మ‌యంలో భౌతిక దూరం పాటించ‌కుండా, ముఖానికి మాస్క్ కూడా లేకుండా అమీర్ ఉండ‌డంతో ఆయ‌న‌పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేయాల్సిందే అంటూ యూపీ పోలీసులకు ఎమ్మెల్యే నంద కిషోర్ ఫిర్యాదు చేశాడు.