Nara Lokesh: మహానాడు వేదికగా కీలక బాధ్యతలు తీసుకోబోతున్న లోకేష్… ఇక తిరుగులేదంతే!

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి కూడా ఈ పార్టీ తరపున మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్న తారక రామారావు గారు ప్రారంభించిన ఈ సంస్కృతిని ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూనే వచ్చారు. ఇలా ప్రతి ఏడాది నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈసారి మాత్రం చాలా విభిన్నంగా మహానాడు కార్యక్రమాన్ని ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈసారి ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీ సాధించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాల కోసం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలు పెట్టారని తెలుస్తుంది అయితే ఈ ఏడాది ఊహించనీ విధంగా కడప జిల్లా జగన్ సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులలో ఈ వేడుకను నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా కడపలో ఎప్పుడు ఇలాంటి వేడుకలను నిర్వహించలేదు.

ఇక పులివెందులలో కనుక ఈ మహానాడు వేడుక జరిగితే పార్టీకి భవితవ్యాన్ని మరింత గట్టిగా తీర్చిదిద్దే వుద్దేశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ మహానాడు వేడుక సందర్భంగా నారా లోకేష్ మరిన్ని కీలక బాధ్యతలను కూడా అందుకోబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ మరోవైపు జాతీయ ప్రధాన కార్యదర్శిగా టీడీపీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.

ఇక మహానాడు సందర్భంగా ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని అందుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చెప్పటం విశేషం. అలాగే సీనియర్లను పక్కనపెట్టి యువ నాయకులకు కూడా అవకాశం కల్పించబోతున్నారని తెలుస్తోంది. అదేసమయంలో పార్టీ భవితవ్యం.. 2047 వరకు అధికారంలో కొనసాగేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.