Coolie: డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం కూలీ. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవ్వడమే కాకుండా సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరో రజనీకాంత్ చేతిలో ఒక బ్యాడ్జి కనిపిస్తూ ఉంటుంది.
ఈ బ్యాడ్జి మీద 1421 అనే నెంబర్ రాసి ఉంది అయితే ఈ నెంబర్ రాయడం వెనుక ఏదైనా కారణం ఉందా లేదా ఏదో ఒక నెంబర్ అని అలా పెట్టేసారా ? అసలు ఈ నెంబరే ఎందుకు పెట్టారు అనే సందేహాలు చాలామందిలో కలిగాయి. అయితే ఈ నెంబర్ పెట్టడం వెనుక గల కారణాన్ని తాజాగా డైరెక్టర్ లోకేష్ ఓ సందర్భంలో తెలియచేశారు. తన తండ్రి ఒక సాధారణ బస్ కండక్టర్ అని లోకేష్ తెలిపారు ఆయన బ్యాడ్జి నెంబర్ 1421 అని, అందుకే అదే నెంబర్ ను కూలి సినిమాలో పెట్టాను అంటూ ఇటీవల తెలియజేశారు.
ఇక ఈ విషయం రజనీకాంత్ గారికి తెలిసినప్పుడు ఆయన ఒకటే మాట అడిగారు మీ నాన్న బస్ కండక్టర్ అనే విషయం నాకెందుకు చెప్పలేదు అని ప్రశ్నించారని లోకేష్ గుర్తు చేసుకున్నారు అయితే రజినీకాంత్ గారికి చెప్పకపోవడానికి కూడా కారణం ఉందని తెలిపారు. నా అంతట నేనే మా తండ్రి గురించి చెబితే ఆయనకు ఎక్కువ కాలం గుర్తు ఉండదని అందుకే స్వయంగా రజనీకాంత్ గారు నాన్న గురించి అడిగినప్పుడు చెబితేనే ఎక్కువ రోజులు పాటు ఈ విషయం గుర్తుండి పోతుంది. అందుకే రజనీకాంత్ గారు అడిగే వరకు నాన్న ఒక బస్ కండక్టర్ అనే విషయం చెప్పలేదని తెలిపారు. ఇక రజనీకాంత్ కూడా సినిమాలలోకి రాకముందు బస్సు కండక్టర్గా పని చేసిన విషయం తెలిసిందే.
