కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. లాక్ డౌన్ తో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దేశం ఆర్ధిక సంక్షభంలో పడింది. కంపెనీలు అన్ని తీవ్రంగా నష్టపోయాయి. ఉద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులయ్యారు. ఉద్యోగం లేదు.. ఉపాధి లేదు. ముంచుకొస్తున్న ఆర్ధిక మాన్యంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కరోనా వచ్చి మొత్తం కోలాప్స్ చేసింది. ఇప్పుడంతా ఖాళీ. కూలీ ,నాలీ చేసుకునే వాళ్లు సైతం పనుల్లేక అల్లాడుతున్నారు. పీజీలు, డిగ్రీలు, ఇంజనీరింగ్ లు, చదువుకున్న వారంతా స్వగ్రామాలకే పరిమితమయ్యారు.. పని కోసం పాకులాడే పరిస్థితి వచ్చింది.
దీంతో చదువుతో సంబంధం లేకుండా కూలీలకు పోటీగా పనుల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఉపాధి హామీ పనులు పున ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో పట్టబద్రులంతా ఉపాధి పనుల వైపు చూస్తున్నారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని కూలీ నాలి చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కోసం పట్టబద్రులు కొందరు ఉపాధి పని కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలంగాణాలో గత మూడు వారాల్లో దాదాపు 59 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మంది పట్టబద్రులే ఉన్నారు. గత ఏడాది మే 18 వరకూ 17.50 లక్షల మంది ఉఫాది పనుల్లో పాల్గొనగా, ఈ ఏడాది మరో 7 లక్షలు మంది అదనంగా ఉఫాది పనులకు హాజరవుతున్నట్లు సర్వేలు చెబుతున్నారు.
ఇందులో ఎక్కువగా ఇంజనీరింగ్, డిగ్రీ ఇతర కోర్సులు చేసినవాళ్లు ఉన్నారు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక్కడ ప్రచ్చన నిరోద్యోగం కూడా తలెత్తిందని తెలుస్తోంది. పనిచేసే సామర్ధ్యం ఉన్నా సామర్ధ్యానికి తగ్గ పని దొరకకపోవడం ప్రచ్చన్న నిరుద్యోగం. ప్రస్తుతం ఆ పరిస్థితి తో పాటు..సాధారణ కూలీలకు కూడా పనులు లేక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కంపెనీలు సగానికి పైగా స్టాప్ ని తగ్గించేయడం వల్ల ప్రధానంగా ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. మళ్లీ సాధారణ పరిస్థితులకు వచ్చే వరకూ పట్టబద్రులకు ఈ తిప్పలు తప్పవని అంటున్నారు.