Liger Glimpse : “లైగర్” గ్లింప్స్ : ఇద్ది అసలు పూరి, విజయ్ దేవరకొండల దండయాత్ర.!

Liger Glimpse : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి కొత్త సంవత్సరం కానుకగా ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్ వీడియో ని ఇప్పుడు రిలీజ్ చేశారు.

ఇది మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. కంప్లీట్ గా పూరి జగన్నాట మాస్ మార్క్ లో అలాగే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ లో అదిరిపోయింది. మెయిన్ గా విజయ్ ముంబైలో స్లమ్ ఏరియాల్లో నుంచి బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడు అనే కోణంలో చూపించిన వేరియేషన్స్ అలాగే పూరి జగన్నాథ్ టేకింగ్ మళ్ళీ పాత రోజులని గుర్తు చేసాయి.

Glimpse of LIGER | Vijay Deverakonda | Puri Jagannadh | Ananya Panday | Karan Johar | 25th August

ఇక అలాగే ఇందులో కనిపించిన ఫైట్ సీన్స్ చూస్తుంటే యాక్షన్ బ్లాక్ లు కూడా గట్టిగానే ఉన్నాయనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే పాన్ ఇండియన్ లెవెల్లో విజయ్, పూరి జగన్నాథ్ ల దండయాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఈ భారీ సినిమాని ఛార్మి మరియు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ లు నిర్మాణం వహించారు.