దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదట.. !

Dubbaka by elections Telugu Rajyam

 

లోకంలో కుదురుగా ఉండని వారు ఎవరంటే రాజకీయ నాయకులని చెప్పవచ్చూ.. ఎప్పుడు పదవుల కోసం, పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడుడు తప్పితే ప్రజలకు ఏం చేస్తున్నాం అనే ఆలోచనే ఉండదు.. ఈ పార్టీలో అవకాశాలు లేకుంటే మరో పార్టీలోకి జంప్ అవడం.. అదీ సిగ్గుపడకుండా.. ఎవరేం అనుకుంటే నాకేంటి అని ఆలోచించే వారే రాజకీయ నాయకులు.. ఇకపోతే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు విశ్లేషకులు.. ఒక వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ కలలు కంటుండగా, అధికార పార్టీ మాత్రం బ్రేకులు వేయకుండా పరిగెడుతున్నట్లుగా తెలుస్తుంది.. ఈ సమయంలో ఒకరికి ఒకరు గట్టి షాకులు ఇచ్చుకోవడం సర్వసాధారణమే..

ఇక మొన్నటికి మొన్న టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇలా శ్రీనివాస్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్‌ పార్టీలో జోష్ పెరిగిందని ఆలోచించే లోపలే హస్తానికి గాయం చేసారు మిగతా కాంగ్రెస్ నాయకులు.. టికెట్‌ ఆశించి భంగపడ్డ సీనియర్‌ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌రావు పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. సుమారు రెండు వేల మంది అనుచరులతో కలిసి మంత్రి హరీష్‌ రావు సమక్షంలో గులాబీ దళంలోకి వెళ్లారు.. ఒకరకంగా కాంగ్రెస్‌కు ఇది బిగ్ షాక్.. ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండదు.

ఇకపోతే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిణామం ఊహించని ఎదురు దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. ఇక ఆగస్టులో దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపధ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో త్రిముఖ పోటీ నెలకొంది..