NBK 107 : బాలయ్య నుంచి లేటెస్ట్ మాస్ జాతర ఇంత సేపు ఉండబోతుందా?

గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో నందమయూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “అఖండ” కూడా ఒకటి. అప్పటికి బాలయ్య కెరీర్ లోనే అధిక బడ్జెట్ సినిమా ఇది కావడం అలాగే అన్నే అంచనాలు నడుమ వచ్చి భారీ వసూళ్లను కొల్లగొట్టి పూర్వ వైభవాన్ని ఈ సినిమా తీసుకొచ్చింది.
అయితే ఈ సినిమా హిట్ తో తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓకే చేసిన ప్రాజెక్ట్ పై మరింత స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి నిన్ననే ఈ సినిమాపై ఒక మాసివ్ అనౌన్సమెంట్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అందించారు. ఈ జూన్ 10న బాలయ్య బర్త్ డే కానుకగా ఒక భారీ అప్డేట్ ని అందిస్తున్నామని తెలిపారు.
అయితే ఇప్పుడు ఈ అప్డేట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ టాక్ వినిపిస్తుంది. ఈ స్పెషల్ డే కి ఒక మాసివ్ ట్రీట్ ని రిలీజ్ చేస్తున్నారట. ఇది దాదాపు 35 సెకండ్లు ఉంటుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే టాక్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
మొత్తానికి అయితే బాలయ్య నుంచి మాస్ జాతర ఇంతసేపు ఉంటుందట. ఇంకా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా పలువురు కన్నడ స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.