Avatar 2 : ప్రపంచ వ్యాప్తంగా “అవతార్ 2” రిలీజ్ పై వైరల్ అవుతున్న కొత్త అప్డేట్.!

Avatar 2 : ప్రపంచ సినీ చరిత్రలో చూసుకున్నట్టు అయితే కనీ వినీ ఎరుగని రీతి వసూళ్లతో  ఉండే చిత్రాల్లో హాలీవుడ్ సినిమా దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ చిత్రాలే టాప్ 5 స్థానాల్లో ఉంటాయి. తన సినిమాలు ఏ రేంజ్ లో ఆడేవి అంటే ఎప్పుడో 1996 టైం లో వచ్చిన టైటానిక్ సినిమా ఇంకా టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటిగా ఉండగా..
2009 లో వచ్చిన “అవతార్” సినిమా ఇప్పటికీ నెంబర్ 1 స్థానంలో ఉంది. అప్పట్లో ఒక 3డి రిలీజ్ లేదు ఇప్పుడు ఉన్నన్ని స్క్రీన్స్ లేవు ధరలు కూడా కూడా లేవు అయినా ఇప్పుడు లెక్కల్లో కూడా ఆ సినిమాలు టాప్ లో నిలిచాయి అంటే ఆడియెన్స్ ఆ సినిమాలను ఎంత పెద్ద హిట్ చేసారో అర్ధం చేసుకోవాలి.
ఇక అవేవి లేకుండానే అప్పుడు అంత పెద్ద సెన్సేషన్ ని నమోదు చేస్తే ఇప్పుడు అన్నీ ఉండి రిలీజ్ అవుతున్న “అవతార్ 2” సినిమా ఎలాంటి కల్లోలం నమోదు చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ గా ఒక అప్డేట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
ఈరోజు ఈ సినిమా తాలూకా గ్లింప్స్ టీజర్ విడుదల కాబోతుండగా మరోపక్క ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన ఏకంగా 160 భాషల్లో అనేక దేశాల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా తెలుపుతున్నారు. అలాగే ఇంకో పక్క ఈ సినిమా దాదాపు 80 శాతం అండర్ వాటర్ లోనే జరిగింది అని ఈసారి విజువల్స్ మామూలుగా ఉండవని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.