విక్రమ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్..మరో రెండ్రోజుల్లో షాకివ్వనున్నాడట.!

తమిళ నాట ఉన్నటువంటి స్టార్ హీరోలలో విలక్షణ హీరో చియాన్ విక్రమ్ హీరోగా ఇప్పుడు నటించిన రెండు భారీ సినిమాలు ఒక నెల తర్వాత మరొకటి విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రాలు ఒకటి “కోబ్రా” కాగా మరొకటి ఇండియన్ సినిమా టాప్ దర్శకుడు మణిరత్నంతో తీసిన భారీ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్”.

అయితే ఈ సినిమా నుంచి నిన్న మేకర్స్ టీజర్ కూడా రిలీజ్ చేసి అదరగొట్టారు. కానీ అనూహ్యంగా అంతకు ముందే విక్రమ్ కి అనుకోని రీతిలో ఛాతిలో నొప్పి రావడం ఆందోళన కరంగా మారింది. అయితే అది ఛాతీలో నొప్పి తప్ప గుండె నొప్పి కాదని అలాగే విక్రమ్ తీవ్ర జ్వరం వల్ల అడ్మిట్ అయ్యాడని తమిళ వర్గాలు కన్ఫర్మ్ చేశారు.

అయితే విక్రమ్ ఆరోగ్యంపై అతడికి చికిత్స అందిస్తున్న కావేరి ఆసుపత్రి వారు కూడా అధికారిక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి విక్రమ్ బాగానే ఉన్నారని అది గుండె నొప్పి కాదని కన్ఫర్మ్ చేశారు అంతే కాకుండా త్వరలోనే డిశ్చార్జ్ కూడా అయ్యిపోతారని తెలిపారు. అయితే ఇదిలా ఉండగా కోలీవుడ్ నుంచి మరో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది.

విక్రమ్ మరో రెండు రోజుల్లో జరగబోయే కోబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపిస్తాడని ఈరోజు అలా తాను డిశ్చార్జ్ అయ్యి వెంటనే కోబ్రా ఈవెంట్ లో పాల్గొంటారని అంటున్నారు. ఇలా అయితే షాకింగ్ అనే చెప్పాలి. మరి విక్రమ్ వస్తాడో లేదో అనేది కూడా చూడాలి.