Bheemla Nayak : లేటెస్ట్ అప్డేట్ : “భీమ్లా నాయక్” కోసం ఇంకో పవర్ఫుల్ వాయిస్ ని రెడీ చేశారు.!

Bheemla Nayak : గత రెండు మూడు రోజులు నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా వినిపిస్తున్న మరో పెద్ద చిత్రం పేరు “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఇది. అయితే ఇప్పుడు మళ్ళీ రెండు రోజులు షూటింగ్ కి బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి ఓ పక్క లీకులు వస్తున్నాయి..

వీటిని చిత్ర బృందం పెద్దగా పట్టించుకోనట్టే అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఒకటి కాగా ఈ సినిమాకి థమన్ ఇచ్చిన మాస్ మ్యూజిక్ అని కూడా చెప్పాలి. మరి వీటిలో ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్ అలానే ప్రతి సాంగ్ కి ఒక కొత్త వాయిస్ ని తీసుకొచ్చారు.

భీమ్లా నాయక్ సాంగ్ కి కిన్నెరమొగులయ్య, లాలా భీమ్లా కి అరుణ్ కౌండిన్య లను దింపి గట్టి ఎక్స్ పీరియెన్స్ ని అందించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో మరో పవర్ఫుల్ వాయిస్ ని రెడీ చేస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. తన అద్భుతమైన వాయిస్ తో ఎన్నో సాంగ్స్ కి ప్రాణం పోసిన సింగర్ కైలాష్ కేర్ ను త్రివిక్రమ్ ఓ స్పెషల్ సాంగ్ కోసం దింపినట్టుగా సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు తెలిపాడు.

అలాగే ఈ సాంగ్ ని రామ జోగయ్య శాస్త్రే రాసినట్టు వెల్లడించాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో చాలా సాంగ్స్ ఉన్నాయని తెలిసింది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఇప్పుడు నుంచే ఆసక్తిగా చూడడం మొదలు పెట్టారు.

https://twitter.com/MusicThaman/status/1493046627745284097?s=20&t=Ly8pWijYVgZ8dpW9Yz8oxQ