లేటెస్ట్ టాక్ : ‘RRR’ భారీ ఈవెంట్ ఏకంగా విదేశంలో అట.!

Latest Talk On Rrr Movie Grand Pre Release Event | Telugu Rajyam

పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం అంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. భారీ లెవెల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని భారీ అప్డేట్స్ తో ముందుకు రాబోతుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది. దాని ప్రకారం ఈ భారీ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏకంగా విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లో అత్యంత గ్రాండ్ గా చేయబోతున్నారని సినీ వర్గాల్లో ఓ గాసిప్ ఇప్పుడు బయటకి వచ్చింది.

ఇక దీనిపై మరింత క్లారిటీ రానున్న రోజుల్లో రానుంది. ఆలియా భట్, అజయ్ దేవగన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles