లేటెస్ట్ టాక్ : ‘RRR’ మళ్ళీ వాయిదా? కానీ జనవరిలోనే!

ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ట్రిపుల్(RRR) సినిమా కోసమే సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున బజ్ నడుస్తుంది. అయితే రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక మీటింగ్ ఇప్పుడు ముంబైలో జరుగుతుండగా దీని ద్వారా ఈ సినిమా రిలీజ్ పై ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది.

ఇది వరకే ఈ సినిమాని వచ్చే జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఆ డేట్ న రాదేమో అని డౌట్స్, టాక్ వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్ దగ్గర పోస్టర్స్ ని చూసినట్టు అయితే అందులో ఎక్కడా కూడా జనవరి 7వ తేదీ కనిపించడం లేదు.

కానీ జనవరి అని మాత్రం మెన్షన్ చేసి ఉంచారు. కావున ఆ డేట్ న సినిమా రిలీజ్ కాకపోయినా జనవరి నెలలోనే ఖచ్చితంగా సినిమా రిలీజ్ ఉంటుంది అని అర్ధం అవుతుంది. మరి ఈ డేట్ ఎపుడు వస్తుందో ఎదురు చూడక తప్పదు.