Akhanda 2: పవన్ కళ్యాణ్ తో పోటీకి సై అంటున్న బాలయ్య… వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు?

Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ వరుస సినిమాల ద్వార ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను సందడి చేసిన బాలకృష్ణ త్వరలోనే అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ గా ఆఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇలా ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల కాబోతుంది అంటే ఇదివరకు నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు అయితే అదే రోజే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి సినిమా కూడా విడుదల కాబోతుందని నిర్మాతలు క్లారిటీ ఇస్తూ వచ్చారు.. ఓజీ సినిమా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. ఈ సినిమా ఖచ్చితంగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కాబోతుంది అంటూ నిర్మాతలు డివివి దానయ్య తెలియజేశారు.

మరోవైపు అఖండ సినిమా షూటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని కేవలం ఒక పాట మాత్రమే షూటింగ్ మిగిలి ఉందని వెల్లడించారు అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కాబోతుందని వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అఖండ 2 నిర్మాతలు తెలియజేశారు. ఇలా ఒకే రోజే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా ఇద్దరు హీరోల మధ్య పోటీ ఏర్పడిన నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఏ హీరో విజయం అందుకుంటారో తెలియాల్సి ఉంది.