“సర్కారు వారి పాట” పెద్దదేనా.? కరెక్ట్ గా సినిమా ఎంతసేపు ఉంటుందంటే..

Sarkaru Vaari Paata Total Run Time

Sarkaru Vaari Paata Total Run Time : తెలుగు సినిమా ఆల్ టైం హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా నిలిచింది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పుడు చిత్ర యూనిట్ అన్ని పనులు చక్కబెట్టి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సాలిడ్ ఎంటెర్టైనర్ డ్రామా పై లేటెస్ట్ గా కీలక అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాని మహేష్ నటించిన రీసెంట్ చిత్రాల్లో కాస్త లెంగ్త్ ఎక్కువగానే వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఈరోజే హైదరాబాద్ ల్లో సెన్సార్ ని పూర్తి చేసుకోగా ఈ చిత్రాన్ని మొత్తం 160 నిమిషాలకి కట్ చేశారట. అంటే దాదాపు 2 గంటల 40 నిముషాలు వచ్చేసిందట. మరి ఇది కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఇంతసేపు దర్శకుడు గాని సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఈ సినిమా భారీ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అని చెప్పాల్సిందే.

అయితే ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ రాలేదు కానీ మేకర్స్ అధికారికంగా చెప్పే నాటికి రెండు మూడు నిముషాలు అటు ఇటు లేదా ఈ 160 నిమిషాలే ఉంటాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ఫస్ట్ టైం కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే సముద్రఖని, నదియా తదితరులు ఈ సినిమాలో నటించారు.