హిట్ ఎఫెక్ట్ : సేమ్ “అఖండ” ఫార్ములా మహేష్ సినిమాకి కాపీ కొట్టేసిన థమన్.!

Mahesh Movie : ఈరోజుల్లో పలు సినిమాలకి సగం హైప్ ఆ సినిమాల తాలూకా పాటలే తీసుకొచ్చేస్తున్నాయి. ఈ పాటల్లో అయితే మన తెలుగు సినిమా నుంచి మాంచి ఊపులో ఉన్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అదిరే ఆల్బమ్స్ ని ఇస్తున్నాడు. ఇప్పుడు అయితే దాదాపు 90 శాతానికి పైగా తన సినిమాలు హిట్ రేషియో లో ఉన్నాయి.

ఏ హీరోతో అయినా కూడా మంచి పాటలు ఇస్తున్న థమన్ లేటెస్ట్ ఆ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న “సర్కారు వారి పాట” తో అలరిస్తున్నాడు. మరి ఈ సినిమా నుంచి ఆల్రెడీ మూడు సాంగ్స్ వచ్చి హిట్ కాగా ఇప్పుడు నాలుగో సాంగ్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇది చూసాక తాను నందమూరి బాలకృష్ణ కి ఇచ్చిన సూపర్ హిట్ ఆల్బమ్ “అఖండ” లో ఓ సాంగ్ గుర్తు రాక మానదు.

అయితే ఆ సినిమాలో “జై బాలయ్య” అంటూ సరిగ్గా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజునే సాంగ్ రిలీజ్ చెయ్యగా ఇప్పుడు “మ మ మహేష్” అంటూ సేమ్ అలానే హిట్ ఫార్ములా కాపీ తో అనౌన్స్ చేశారు. పైగా ఇది కూడా మంచి డ్యూయెట్ సాంగ్ నే కావడం గమనార్హం. వీటికి తోడు ఆ పోస్టర్ ను కూడా అలాగే రిలీజ్ చేసారు.

అయితే మరి రేపు వచ్చే ఈ సాంగ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో నదియా, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు మహేష్ బాబు మూవీస్ సహా 14 రీల్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్మాణం అందించారు.