Harihara Veeramallu  : హరిహర వీరమల్లు మరో కీలక అప్డేట్స్!

Harihara Veeramallu  :  గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ క్రేజీ సినిమాల్లో తన కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అలాగే తన కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”. స్టార్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాని పవన్ ఇమేజ్ మరియు సినిమా నేపథ్యం కి తగ్గట్టుగా ఎక్కడా తగ్గకుండా తగ్గించకుండా సాలీడ్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏక్షన్ బ్లాక్స్ లో అయితే పవన్ లో ఉన్న నైపుణ్యం అంతటినీ కూడా బయటకి తీసే ప్రయత్నం క్రిష్ చేస్తున్నాడు.
దీనితో ఈ విషయంలో మాత్రం పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉండగా ఈ ఏక్షన్ బ్లాక్స్ పైనే ఇపుడు ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది. ఈ సినిమాలో పవన్ పై 1000 మందితో పోరాడే ఒక భారీ సీన్ ఉంటుంది అట. అయితే ఇది ఈ సినిమాలోనే ఒక భారీ హైలైట్ సీన్ గా కనిపిస్తుంది అని..
దానిని చాలా అత్యున్నత ప్రమాణాలతో తీస్తున్నారని ఇప్పుడు టాక్ బయటకి వచ్చింది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవన్ మరియు నిధి ల మధ్య లవ్ సాంగ్ ఉంటుందట.
దానికి ఇప్పుడు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి చాలా హార్డ్ గా వర్క్ చేస్తున్నారని తెలిపారు. దీనితో ఈ రెండుకు ఇంట్రెస్టింగ్ టాక్స్ తో పవన్ అభిమానుల్లో కొత్త జోష్ ఇప్పుడు వచ్చింది.