బిగ్ బజ్ : ‘RRR’ ట్రైలర్ పై మరో ఆసక్తికరమైన సమాచారం మీకోసం.!

టాప్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్(RRR) అనే భారీ సినిమా తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదిరే ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న ఈ చిత్రం నుంచి వచ్చే డిసెంబర్ మొదటి వారంలోనే భారీ ట్రైలర్ ని రిలీజ్ చేసుకోనుంది.

అయితే ఈ ట్రైలర్ పై బిగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది. ఈ ట్రైలర్ మొత్తంగా మూడు నిమిషాల 6 సెకండ్ల నిడివి మేర ఫైనల్ కట్ చెయ్యగా భారీ లెవెల్ యుద్ధ సన్నివేశాలు అలాగే రాజమౌళి మార్క్ ఎమోషన్స్ కనిపించనున్నాయట.

ఇంకా ఇందులో ఇంకో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ కన్నా ఈసారి ఎన్టీఆర్ పై ఎక్కువ స్పేస్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. మరి ఇది ఎంతమేర నిజమో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వగా డివివి దానయ్య నిర్మించారు.