Bheemla Nayak Release : ఇన్సైడ్ టాక్ : ఇలా అయితేనే “భీమ్లా నాయక్” బొమ్మ పడేది.!

Bheemla Nayak Release : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న కొన్ని సాలీడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో క్రేజీ అంచనాలతో వస్తున్న సినిమా “భీమ్లా నాయక్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్నారు.

మరి షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చెయ్యగా దీనిపై రెండు రిలీజ్ డేట్ లను వారు లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మేర ఈ ఫిబ్రవరిలోనే సినిమా రిలీజ్ అయ్యిపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు కీలక కారణాలు సహకరించాలట.

ఏపీలో ముందులా మళ్ళీ పరిస్థితి రావాలట. అంటే ఇప్పుడు ఉన్న నైట్ కర్ఫ్యూ మొదటగా ఎత్తివేసి ఆ తర్వాత థియేటర్స్ అన్నీ 100 శాతం అక్యుపెన్సీ ని స్టార్ట్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవ్వడాన్ని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్. అందుకే ఇపుడు నుంచే ఈ ఫిబ్రవరి రిలీజ్ పై పవన్ అభిమానులు అంచనాలు తక్కువ పెట్టుకుంటే మంచిది.

ఇక ఈ సినిమాలో ఇద్దరి హీరోల సరసన నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. థమన్ సంగీతం ఇస్తుండగా నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు.