Box Office Report Of KGF Chapter 2 : బాక్సాఫీస్ రిపోర్ట్ : అక్కడ మరో భారీ రికార్డు కి చేరువలో “కేజీఎఫ్ 2” వసూళ్లు.!

Box Office Report Of KGF Chapter 2

Box Office Report Of KGF Chapter 2 :  ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న లేటెస్ట్ సినిమా “కెజిఎఫ్ చాప్టర్ 2”. మరి ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. భారీ అంచనాలు నడుమ గత వారం రిలీజ్ అయ్యిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా హిందీలో కూడా రికార్డు వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తుంది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం అక్కడ కూడా వారం దాటినా స్ట్రాంగ్ వసూళ్లను అందుకుంటూ రికార్డు మార్క్ 300 కోట్లకి దగ్గరలో ఉంది. లేటెస్ట్ గా గత శుక్రవారం 11.6 కోట్లు నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో అక్కడ 280 కోట్లకి ఈ చిత్రం వసూళ్లు చేరుకున్నాయి.

అలాగే ఇక ఈ వారాంతానికి అయితే ఈ సినిమా 300 కోట్లు ఈజీగా క్రాస్ చేసేస్తోంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా 500 కోట్లకి చేరువ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ రవీనా టాండన్ మరియు ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు నిర్మాణం వహించారు.