Lady Super Star Nayanthara : ఆ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార తోపు!

Lady Super Star Nayanthara

Lady Super Star Nayanthara : నయనతారకు పెళ్లయిపోయిందా.? అదేంటీ ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా నయన్ పెళ్లి చేసేసుకుందా.? నయన్ పెళ్లి గురించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తూనే వుంది. లేటెస్టుగా మళ్లీ నయన్ పెళ్లి సోదిలోకి వచ్చింది. అందుకు కారణం నయనతారే.

అసలు విషయంలోకి వెళితే, గత కొంతకాలంగా నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు కూడా. విహార యాత్రలంటూ, వీకెండ్ ఎంజాయ్‌మెంట్లంటూ, బర్త్‌డే పార్టీలంటూ ఈ జంట విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూనే వుంటుంది.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే వుంటాయ్. నయన్, విఘ్నేష్ జంట నుంచి ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వస్తుందంటూ కెమెరా ఈ జంటపై ఓ కన్నేసే వుంచుతుంది ఎప్పుడూ.
మొన్నామధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో నయన చేతికి ఎంగేజ్‌మెంట్ రింగును గుర్తించింది కెమెరా కన్ను. అవును నిజమే మా ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. అంటూ నయనతార చూజాయగా సీక్రెట్ లీక్ చేసింది. తాజాగా చెన్నైలో ఓ గుడిలో ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోల్లో నయన్ నుదుటిపై సింధూరాన్ని కనిపెట్టేశారు మన నెటిజనం. అంటే, సైలెంట్‌గా నయన్ పెళ్లి కూడా చేసేసుకుందా.? అంటూ అనుమానాలు మొదలైపోయాయ్.

ఇదిలా వుంటే, అనధికారంగా విఘ్నేష్ శివన్ భార్యగానే పిలవబడుతోంది నయనతార. కానీ, అలా ఎవరైనా పిలిస్తే ఒప్పుకోదు. ఈ విషయంలో నయనతార తోపు. ఎందుకంటే, భార్య హోదా దక్కిందంటే, హీరోయిన్ స్టేటస్ కొంత షేక్ అయ్యే ప్రమాదముంది. పైగా శింబు, ప్రభుదేవా, ఇప్పుడు విఘ్నేష్ శివన్.. తేడా కొడితే ఈ సారి మాట తిరగేయడం కష్టం. నయనతార మహా ముదురు గురూ.!