Nayanthara: నయనతార దిగాలంటే చాటెడ్ ఫ్లైట్ ఉండాల్సిందే

Nayanthara using special flights only

Nayanthara: సౌత్ ఇండియన్ హీరోయిన్లలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లలో నయనతార అగ్ర స్థానంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మధ్య తరహా హీరోల స్థాయిలో ఉంటోంది ఆమె రెమ్యునరేషన్. పెద్దది కానీ చిన్నది కానీ సినిమాలో హీరోయిన్ పాత్ర ఆమె చేసింది అంటే భారీ పారితోషకం చెప్పించాల్సిందే. అందుకే చిన్న చితక నిర్మాతలు ఆమెను అప్రోచ్ అవ్వడానికి జంకుతున్నారు.

Nayanthara using special flights only
Nayanthara using special flights onlyNayanthara using special flights only

నయన్ పారితోషకము పుచ్చుకోవడమే కాదు స్థాయిని మెయింటైన్ చేయడంలోనూ తన లెవల్ చూపిస్తోంది. ఈమధ్య ఎక్కడికి వెళ్లినా చాటెడ్ ఫ్లైట్స్ మాత్రమే ఎక్కుతోంది ఆమె. ప్రియుడితో విహారానికి వెళ్లాలన్నా, సినిమా షూటింగ్లకు హాజరుకావాలన్నా ప్రత్యేక విమానం బుక్ చేసుకుంటోంది. కరోనా భయం మూలానే ఇలా చేస్తోందట ఆమె.

ప్రజెంట్ ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ యొక్క ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొంటోంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబద్లో జరుగుతోంది. నిన్ననే ఆమె షూటింగ్లో పాల్గొనడం కోసం హైదరాబాద్ చేరుకుంది. అది కూడ స్పెషల్ చాటెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని. మరి ఈ ఫ్లైట్ చిత్ర నిర్మాతలు బుక్ చేశారో లేకపోతే ఆమే తన సొంత డబ్బులతో చేసుకుందో తెలీదు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం హైదరాబాద్ కు అందరిలా మామూలు విమానంలోనే దిగారు.