Aadhi Pinisetty : కుమార్ బాబుకి పెళ్లంట.. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

 Aadhi Pinisetty : ‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు ఆది పినిశెట్టి. మంచి నటుడు. హీరో వేషం వేస్తే, పక్కింటబ్బాయ్‌లా కనిపిస్తాడు. విలన్ వేషం కడితే, ఆ పాత్రకు సరికొత్త స్టైల్ అద్దేస్తాడు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రాణం పెట్టేస్తాడు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో ధిట్ట ఆది పినిశెట్టి.

హీరోగా ఓ పక్క నటిస్తూనే, ఆది పినిశెట్టి ఈ మధ్య డిఫరెంట్ రోల్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆయా పాత్రల్లో ఆది సక్సెస్ అవుతున్నాడు. ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ అన్నయ్య కుమార్ బాబుగా ఆది పోషించిన పాత్ర నెవ్వర్ బిఫోర్, అండ్ ఎవ్వర్ ఆఫ్టర్.  అయితే, అసలు టాపిక్ ఏంటంటే, తాజాగా మనోడి లవ్ స్టోరీ ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

కామ్‌గా మనోడు ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడట. చాలా కాలంగా వీరిద్దరి మధ్యా లవ్ ట్రాక్ నడుస్తోందనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇరు కుటుంబాల వారూ వీరి ప్రేమను ఒప్పుకోవడంతో త్వరలోనే పెళ్లి ముహూర్తాలూ కూడా పెట్టేస్తారనీ తెలుస్తోంది.

ఇంతకీ, ఆదిని పెళ్లి చేసుకోబోయే ఆ అందాల భామ ఎవరో తెలుసా.? నిక్కీ గల్రాని. ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన గల్రాని సిస్టరే ఈ నిక్కీ గల్రాని. తెలుగులో సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించింది. అంతకు ముందే, ఆది పినిశెట్టితో ‘మలుపు’ సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత ‘మరకతమణి’ సినిమాలోనూ ఈ జంట సందడి చేసింది. దాదాపు అప్పటి నుండే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందనీ, అది పెరిగి పెద్దదై, ఇప్పుడు పెళ్లి పీటలవరకూ చేరిందనీ అంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ క్యూట్ కపుల్స్ వెడ్డింగ్.