Krithi Shetty Remuneration: కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ చిత్రంగా నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బంగార్రాజు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో నాగార్జున నాగచైతన్యకు జోడిగా రమ్యకృష్ణ కృతి శెట్టి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బంగార్రాజు సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కృతి శెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
గత ఏడాది ఉప్పెన సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి ఈ ఏడాది చివరిలో నాని శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా మరోక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా ఈమె నటించిన సినిమాలు విజయవంతం కావడంతో కృతి శెట్టికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అంతే కాకుండా వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.ఈక్రమంలోనే కృతి శెట్టి లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించడంతో ఈమెకు ఈ సినిమాలో నటించినందుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించారనే టాక్ వినపడుతోంది.
ఇలా ఈ సినిమాలో నటించినందుకు కృతి శెట్టి ఏకంగా రెండు కోట్లు పారితోషికం తీసుకున్నారనే వార్తలు వినపడటంతో ఈ విషయంపై డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ స్పందిస్తూ అసలు క్లారిటీ ఇచ్చారు. నిజానికి కృతి శెట్టి ఉప్పెన సినిమా కన్నా ముందుగా ఈ సినిమా కథ వినిపించామని,అయితే అప్పుడు తనతో పారితోషికం విషయం గురించి చర్చలు జరపలేదని తెలిపారు. ఎవరికైనా సరే మార్కెట్ బట్టి పారితోషికం చెల్లించాల్సి ఉంటుందని అందుకే ఈ సినిమాలో కృతి శెట్టి అడిగిన మొత్తం చెల్లించామని దర్శకుడు తెలిపారు. ఒకవేళ ఉప్పెన కంటే ముందుగా ఈ సినిమాలో నటించడం కోసం పారితోషికం గురించి మాట్లాడుకునే ఉంటే కొంత వరకు ఆమెకు పారితోషికం తగ్గేదని కళ్యాణ్ కృష్ణ ఈ విషయం గురించి బయటపెట్టారు.