Krack Jayamma : టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో సినిమాలో జయమ్మ సాలీడ్ రోల్.!

Krack Jayamma

Krack Jayamma : సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి మంచి టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకామె. మన తెలుగులో అయితే మాస్ మహారాజ్ రవితేజ నటించిన “క్రాక్” సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి అందులో ‘జయమ్మ‘ (Krack Jayamma) అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యిపోయింది.

మరి ఇప్పుడు ఇలాంటి వెర్సిటైల్ నటి టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఆ సినిమానే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా బిగిల్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాల ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా “హను మాన్”.

అ!, జాంబీ రెడ్డి లాంటి కొత్త తరహా సినిమాలు చేసి టాలీవుడ్ స్టాండర్డ్స్ సెట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. మరి వీరి సినిమాలో “అంజమ్మ” అనే పాత్రకి వరలక్ష్మి ని లాక్ చేసినట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. అలాగే ఈ పోస్టర్ లో ఆమెని చూసినట్టు అయితే తనకి తగ్గ పాత్రనే ఇచ్చినట్టు అనిపిస్తుంది.

చేతిలో కొబ్బరి బొండాల గెల ఆల్రెడి రౌడీ లకు ఫుల్ కోటింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. పైగా పెళ్లి కూతురు గెటప్ లో ఆమె కనిపిస్తుండడం మరింత ఆసక్తిగా ఉంది. మొత్తానికి అయితే అప్పుడు జయమ్మ గా ఇప్పుడు అంజమ్మ గా ఇంకో గుర్తుండిపోయే పాత్రే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండగా దీనిపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి.