ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్​ఏ హత్య

వీఆర్​ఏ దారుణ హత్యకు గురయ్యాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్​ఏ దుర్గం బాబు దారుణంగా హత్య చేశారు. సోమవారం ఉదయం తహశీల్దార్ కార్యాలయం తెరవగా ఆఫీసులో ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉండటం గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని అతణ్ని ఎవరు హత్య చేసుంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్​ఏగా పనిచేస్తున్నారు