సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య తరచూ వివాదాల్లోకెక్కుతున్నారు. బాలయ్య తనపై ఉమ్మి వేశారంటూ ఓ సందర్భంలో చెప్పారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబు తనను తిట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌కి సంబంధించి కూడా వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. తాజాగా బుల్లితెర యాంకర్, నటి అనసూయ దుస్తులపై కామెంట్ చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
అనసూయ మంచి నటి. చాలా బాగా డాన్సులేస్తుంది. కానీ, పొట్టి పొట్టి దుస్తులేసుకోవడమే తనకు నచ్చదనీ, ఆ పద్ధతిని అనసూయ మార్చుకుంటే బావుంటుందనీ ఉచిత సలహా ఇచ్చారాయన. అయితే, అనసూయకు అస్సలు నచ్చని మాట అదే. తన దుస్తులపై ఎవరైనా కామెంట్ చేస్తే, ఎక్కడ లేని కోపంతో చిర్రెత్తిపోతుంది అనసూయ.
అలాంటిది పాపం.. పెద్దాయన. ఆయనకెందుకొచ్చిన తంటా ఇదంతా. ఎందుకు అనసూయ పుట్టలో వేలెట్టారు. తన పుట్టలో వేలు పెడితే అనసూయ ఊరుకుంటుందా.? మొన్నీ మధ్యనే ‘మా’ ఎలక్షన్స్ విషయంలో రాత్రి గెలిచి, తెల్లారి ఓడిందన్న న్యూస్ విషయంలో మీడియాపైనే అనసూయ గుస్సా అయిన సంగతి తెలిసందే. అలాంటిది ఈ పెద్దాయన చేసిన కామెంట్స్ విషయంలో అనసూయ రెస్పాన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలిక.