చిరు వాఖ్యలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు.. ఆ మాటలు నచ్చవు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్న అంశంపై ఇప్పటికే పలుసార్లు ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి అని ఎంతో మంది భావిస్తున్నప్పటికీ, కానీ చిరంజీవి మాత్రం సినీ ఇండస్ట్రీ పెద్ద అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అందరు గల కారణాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే ఇటీవలే మంచు ఫ్యామిలీ వరుసగా మెగాఫ్యామిలీపై వైరల్ కామెంట్స్ చేస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల మే డే రోజున జరిగిన సినీ కార్మికుల ఉత్సవంలో తాను చిత్రపురి కాలనీ సినిమా కార్మికుల కోసం ఒక ఆసుపత్రి అలాగే సినీ కార్మికుల పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించబోతున్నాను అని చిరంజీవి తెలిపిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటివరకు ఆ విషయం పట్ల ఇండస్ట్రీ నుంచి ఎవరు పెద్దగా స్పందించలేదు. కానీ టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు చిరంజీవి ఆసుపత్రిని కట్టిస్తాను అన్నా వాఖ్యలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చిరంజీవి కట్టించే ఆ హాస్పిటల్ ఎవరికి కావాలి. మొదట సినీ కార్మికులకు ఫుడ్ పెట్టాలని, చాలామంది సినీ కార్మికులు తినడానికి తిండి లేక చేయడానికి పని లేక అల్లాడిపోతున్నారని, కృష్ణానగర్లో ఆకలితో అలమటిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారని, అంతేకాకుండా చెడు వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.

మొదట అలాంటి వారికి తిండి పెట్టాలని వారి దగ్గర డబ్బులు ఉంటే అపోలో ఆసుపత్రికి వెళతారు కానీ చిరంజీవి కట్టించిన ఆస్పత్రికి ఎందుకు వెళ్తారు అంటూ చిరంజీవి వ్యాఖ్యలపై సంచలన కామెంట్స్ చేశారు కోట శ్రీనివాస రావు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, ప్రస్తుతం తదుపరి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.