Koratala Tripla Dhamaka : ఇద్దరు మెగా హీరోలు.. చిరు, చిరుతలను ఒకే స్క్రీన్ మీద చూపించే అదృష్టం దక్కించుకున్నాడు దర్శకుడిగా కొరటాల శివ. చాలా అరుదుగా వచ్చే అవకాశమిది. అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకున్న కొరటాల శివ ఇప్పుడు మెగా డైరెక్టర్‌గా సరికొత్త గౌరవం దక్కించుకుంటున్నాడు.
ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్ర్కీన్‌పై చూపించడం అంటే ఆషామాషీ విషయం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అది రాజమౌళికి దక్కింది. ‘ఆచార్య’ సినిమాతో కొరటాలను ఆ అదృష్టం వరించింది.
ఇంతటితో కొరటాల బాధ్యత తీరిపోయిందా.? కానే కాదు, చిరంజీవి మరో అతి పెద్ద బాధ్యతను కొరటాల చేతుల్లో పెట్టనున్నాడనీ తెలుస్తోంది.
మెగా సతీమణి సురేఖ కలల ప్రాజెక్టుగా ‘ఆచార్య’ రూపు దిద్దుకుంది. ఇప్పుడు చిరంజీవి కలల ప్రాజెక్టు ఒకటి తెరపైకి వచ్చింది.
మెగా సతీమణి సురేఖ కలల ప్రాజెక్టుగా ‘ఆచార్య’ రూపు దిద్దుకుంది. ఇప్పుడు చిరంజీవి కలల ప్రాజెక్టు ఒకటి తెరపైకి వచ్చింది.
తనయుడు రామ్ చరణ్‌తో పాటు, తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో కూడా చిరంజీవి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట.
‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన ఈ కోరికను అభిమానులతో పంచుకున్నారు. చరణ్, పవన్‌లతో కలిసి ఓ సినిమా చేయడానికి ‘ఆచార్య’ సినిమాతో బీజం పడింది.. అని మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందంటూ అప్పుడెప్పుడో ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయ్. ఇటు చిరంజీవి, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలకు దూరమైపోయారు. కానీ, కాలం గిర్రున తిరిగింది. మళ్లీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, చకచకా సినిమాలు చేస్తుండడం జరుగుతోంది.
సో, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇంకెంతో సమయం పట్టనే పట్టదేమో. సరే, ఆ సంగతి అటుంచితే, ఇప్పుడు ట్రిపుల్ మెగా పవర్ సత్తా ఏంటో చూపించేందుకు మెగా ఫ్యామిలీ సిద్ధమవుతోందంటూ చిరంజీవి మాటల ద్వారా అర్ధమవుతోంది.
ఇద్దరు మెగా హీరోల్ని ఒకే తెరపై చూస్తేనే ఫ్యాన్స్ ఆనందానికి హద్దూ అదుపూ వుండదు. ఇక, ‘ట్రిపుల్ మెగా’ అంటే అభిమానులు ఆనందానికి ఆకాశమే హద్దు అనడం అతిశయోక్తి కాదేమో.
ఇద్దరు మెగా హీరోల్ని ఒకే తెరపై చూస్తేనే ఫ్యాన్స్ ఆనందానికి హద్దూ అదుపూ వుండదు. ఇక, ‘ట్రిపుల్ మెగా’ అంటే అభిమానులు ఆనందానికి ఆకాశమే హద్దు అనడం అతిశయోక్తి కాదేమో.
ఈ అరుదైన కాంబినేషన్‌ని తెరకెక్కించే అదృష్టం డైరెక్టర్‌గా మళ్లీ కొరటాల శివకే దక్కుతుందా.? అంటే, అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయ్. అంతటి స్టామినా అటు రాజమౌళికి వుంది. ఆ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో ఆ సత్తా కొరటాల శివ దక్కించుకున్నాడనాలేమో.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆ బాధ్యతను కొరటాల శివకే అప్పగిస్తాడా.? చూడాలి మరి, ఈ ‘టిపుల్ మెగా’ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో.!