ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు సాలిడ్ మల్టీ స్టారర్ అండ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన “ఆచార్య” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మెగా ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఓ డేట్ ఫిక్స్ అయ్యింది అదే డిసెంబర్ 17న అని గట్టి టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుండగా ఇంకా అయితే దీనిపై సరైన సమాచారం బయటకి రాలేదు.
కానీ అసలు డేట్ కే ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని ఫిక్స్ అయ్యింది మాత్రం దర్శకుడు కొరటాల శివేనట. డిసెంబర్ 17 నే ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని నిర్మాతలకు తాను సూచించాడట. అప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమా ఆల్రెడీ డేట్ లాక్ చేసి ఉన్నా ఈ తేదీ అయితేనే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నాడని తెలుస్తుంది. మరి ఈ పర్టిక్యులర్ డేట్ నే కొరటాల ఎందుకు ఫిక్స్ అయ్యారో అన్నది మరింత సమాచారం రావాల్సి ఉదని.