వరంగల్ రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా కొండా సురేఖ గురించి మాట్లాడాల్సిందే. అవును.. ఆమె వరంగల్ జిల్లాకే ఫైర్ బ్రాండ్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆమెకు, ఆమె కుటుంబానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమె ఏది చెబితే అదే. ఎంత చెబితే అంతే. కొన్ని రోజులు వరంగల్ జిల్లా రాజకీయాలనే ఆమె శాసించారు అంటే అతిశయోక్తి కాదు.
అయితే.. గత కొన్ని రోజుల నుంచి ఆమె కాస్త సైలెంట్ గా ఉంటున్నారు. దానికి కారణం.. ప్రస్తుతం ఆమె ఉన్న పార్టీ కావచ్చు.. పార్టీ నుంచి ఆమెకు వచ్చే సమస్యలు కావచ్చు. టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరినా.. అక్కడ ఆమెకు ఆశించిన స్థాయిలో మద్దతు రావడం లేదు. టీఆర్ఎస్ పార్టీతో విభేదించాలన్నా.. కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తర్వాత కాస్తో కూస్తో పాపులర్ అవుతున్న బీజేపీ పార్టీపై ఆమె మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాలంటే.. వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవాలంటే కొండా సురేఖ మాత్రమే చేయగలరు.
అందుకే.. బీజేపీ పార్టీలో చేరి.. ఆ పార్టీ మద్దతుతో టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్నది సురేఖ నిర్ణయంగా తెలుస్తోంది. కొండా సురేఖను బీజేపీలోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు కూడా ప్లాన్ వేస్తున్నారట. వరంగల్ జిల్లాలో బీజేపీకి పట్టు పెరగాలంటే ఖచ్చితంగా ఒక ఫైర్ బ్రాండ్ కావాలని.. కొండా సురేఖ అయితేనే కరెక్ట్ అని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
2018లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస నుంచే ఎంపీగా ఫోటీ చేయాలని భావించినా… అది కుదరలేదు. కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీపై ఆమె విమర్శల వర్షం కురిపించినా.. గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉంటున్నారు.
ఒకవేళ ఆమె బీజేపీలో గనుక చేరితే.. ఖచ్చితంగా టీఆర్ఎస్ కు అది మైనస్ పాయింటేనని.. వరంగల్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతుందని అంటున్నారు. అయితే.. ఈ విషయంపై అటు కొండా సురేఖ నుంచి కానీ.. బీజేపీ నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.