మళ్లీ యాక్టివ్ అయిన కొండ దంపతులు

ఒకప్పుడు వరంగల్ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కొండ దంపతులు ఓరుగల్లు కోట సాక్షిగా ఎదురులేని విధంగా రాజకీయాలు నడిపారు. ఓరుగల్లు కోటలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఒకప్పుడు ఫేమస్ కపుల్. వైఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని చవిచూసింది ఈ జంట. అయితే అది గతం. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరింది ఈ జంట. అయితే వీరి ఆధిపత్య ధోరణి సహించలేక గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కిందటి అసెంబ్లీల్లో టిక్కెట్టు నిరాకరించారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్టు తెచ్చుకున్నా ఎన్నికల బరిలో ఓడిపోయారు కొండ సురేఖ.

ఇక అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు కొండ దంపతులు. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొంత మంది గులాబీ పార్టీ కార్పోరేటర్లకు కాంగ్రెస్ కండవా కప్పి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ యాక్టివ్ అయ్యారు. కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి మరో రెండేళ్ల తర్వాత రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటోంది ఈ జంట. అయితే గతంలో చూపించిన దూకుడు ఇప్పుడు చూపిస్తే రాజకీయాలు సాగవని వరంగల్ వాసులు అంటున్నారు. ఎంత సేపు కార్యకర్తలను పోంచి పోషిచడం మీదే దృష్టి పెడితే కష్టమని కాస్త ప్రజల గురించి పట్టించుకుంటే ఎదురుండదని సూచిస్తున్నారు.