మనందరికీ నవ్వులు పంచిన రైటర్ కెరీర్…ఈ రోజు డైలమాలో !!

kona career in dilemma now

తెలుగు చిత్ర సీమలో ఉన్న రచయితల్లో కోన వెంకట్ చెప్పుకోదగిన వాళ్ళలో ఒకడు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ రైటర్. రచయితలు కూడా కోటి రూపాయిల పారితోషకం తీసుకోవటం ఆయన నుండే మొదలయింది. ఆయన చేసిన సినిమాలకు కోటి రూపాయల పై స్థాయిలో పారితోషకాలు అందిన సందర్భాలున్నాయి. శ్రీను వైట్ల కాంబినేషన్లో కోన ఎలాంటి హిట్లు ఇచ్చాడో తెలిసిందే. తెలుగు సినిమాలో సరికొత్త కామెడీ ట్రెండ్ సృష్టించిన ఘనత కోనకు చెందుతుంది. ఐతే తాను సృష్టించిన ట్రెండులో తానే చిక్కుకుపోయి దాన్నుంచి బయటికి రాలేక పట్టు కోల్పోయాడు. ఆయన కలం పదును కోల్పోయి చాలా కాలం అయింది. మధ్యలో రైటింగ్ పరంగా కోన ప్రమేయం లేని ‘నిన్ను కోరి’ మినహాయిస్తే.. గత ఐదారేళ్లలో అన్నీ ఫెయిల్యూర్లే చూశారాయన. రచయితగా తన పనైపోతున్న సమయంలోనే ప్రొడక్షన్లోకి అడుగు పెట్టి తెలివిగా సినిమాలు నిర్మించటం మొదలుపెట్టాడు.

kona career in dilemma now
kona career in dilemma now

టాలీవుడ్లో తనకున్న పరిచయాలనే ఉపయోగించుకుని.. అవకాశం కోసం చూస్తన్న దర్శకులను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలను కలిపి సినిమా సెట్ చేయడం.. ప్రొడక్షన్ రైటింగ్ మేకింగ్లో తన సహకారం అందించడం ద్వారా నిర్మాణ భాగస్వామి కావడం.. ఇలా నడుస్తోంది ఆయన వ్యవహారం. ఐతే ఇంతకుముందు కోన ఇలా సెట్ చేసిన కొన్ని సినిమాలు ఆడాయి కానీ.. ఈ మధ్య ఆయన హ్యాండ్ అస్సలు పని చేయట్లేదు. ఆయన చేయి పెట్టిన సినిమాలన్నీ తుస్సుమంటున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘నిశ్శబ్దం’ చేరింది.

హేమంత్ మధుకర్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ ఇంత పెద్ద కాస్టింగ్ బడ్జెట్లో ఈ సినిమా చేయగలిగాడంటే అందుక్కారణం కోననే. ఆయన మీద భరోసాతోనే నిర్మాతలు పెట్టుబడి పెట్టారు. కానీ తీరా చూస్తే కోన జడ్జిమెంట్ తిరగబడింది. పెట్టుబడి మీద డెఫిషిట్తోనే అమేజాన్ ప్రైమ్ వాళ్లకు సినిమాను అమ్మారు. కానీ సినిమాకు ఆశించిన స్పందన లేక.. ప్రైమ్ వాళ్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నెగెటివ్ టాక్ నేపథ్యంలో డబ్బింగ్ రీమేక్ రైట్స్కూ డిమాండుండదు. దీంతో కోన పేరు బాగా దెబ్బ తినేసే పరిస్థితి వచ్చేసింది. ఇటీవలి ట్రాక్ రికార్డు చూశాక కోనను నమ్మి ఇంకెవ్వరూ పెట్టుబడి పెట్టే అవకాశాలు లేవు అనే చెప్పుకోవాలి.