రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రకంపనలు సృష్టించిన రామతీర్థం సంఘటన విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీ నేతలు స్పదించారు. ముఖ్యంగా చంద్రబాబు ఏకంగా రామతీర్థం వెళ్లి మరి పరిశీలించి వైసీపీ మీద విమర్శలు చేశాడు , ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి టీడీపీ మీద ఆరోపణలు చేశాడు , ఇక దేవాలయాల విషయం కాబట్టి బీజేపీ ఎలాగూ ముందు ఉంటుంది.
ఇక తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని కూడా రామతీర్థం సంఘటనపై అక్కడ చంద్రబాబు పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాల్లో దేవుళ్ళను అడ్డంపెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారు.రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది చంద్రబాబే. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి. పదవుల కోసం గుళ్ళు, మసీదులు, చర్చిలు, తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడడం ఆశ్చర్యం.
అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ళ విగ్రహాలను డంపింగ్ యార్డ్‌ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ఆధ్వర్యంలోని అతని అనుచరులు అధీనంలో ఉన్న గుళ్ళు, ఊరికి దూరంగా ఉన్న గుళ్ళలో దాడులు జరుగుతున్నాయి. దేవుడులాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు. స్వార్థ రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థంలో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారు.అంటూ నాని వ్యాఖ్యానించాడు.
దేవుడంటే నమ్మకం కలిగిన వ్యక్తి సీఎం జగన్, రామతీర్థం ఘటనపై నీతి, నిజాయితీగా విచారణ చేసి దోషులను పట్టుకోవాలనీ ఆదేశాలు జారీ చేశారు. నూటికి నూరు శాతం విచారణ చేసి వాళ్ళు దోషులైతేనే అరెస్ట్ చేయండి. ఎదో రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పక్క పార్టీ నేతలను అరెస్ట్ చేయకండి. అలా చేస్తే ఆ దేవుడు మనల్ని శిక్షిస్తాడు అంటూ జగన్ మాట్లాడాడు, అదే నాలాంటి వాడు సీఎం గా ఉంటే కథ వేరేగా ఉంటుంది అంటూ నాని అన్నారు. ఇక తాజాగా చేపట్టిన విచారణలో చంద్రబాబు దోషిగా ఉన్నా.. లేదా..? అతని తండ్రి ఖర్జూర నాయుడు ఉన్నా, తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవనీ చవట, దద్దమ్మ లోకేష్.. ముఖ్యమంత్రి జగన్‌కు ఛాలెంజ్ విసరడం విడ్డూరం’ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.