చిన్న హీరో.. చేతిలో ఐదు సినిమాలు

Kiran Abbavaram had five movies in hand

Kiran Abbavaram had five movies in hand

ఈమధ్య చిన్న హీరోలకే డిమాండ్ ఎక్కువ ఉంటోంది. ప్రేక్షకులకు కూడ వాళ్లే మంచి కథలతో వస్తారనే నమ్మకం క్రియేట్ అయింది. అందుకే ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కిరణ్ అబ్బవరం.. ఇప్పటివరకు అతన్నుండి వచ్చింది ఒకే ఒక్క సినిమా. అదే ‘రాజావారు రాణిగారు’. అది కూడ అంతంతమాత్రంగానే ఆడింది. ఆ సినిమా తర్వాత కిరణ్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమా చేస్తున్నారు. అది ఇంకా రిలీజ్ కాలేదు. కానీ సినిమాలో పాటలు సూపర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం ఈ చిన్న హీరో చేతిలో ఐదు సినిమాలున్నాయి.

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కాకుండా ‘సెబాస్టియన్, సమ్మతమే’ అంటూ ఇంకో రెండు సినిమాలు చేస్తున్నారు. అంటే మొత్తం మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మూడు కూడ ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అవి కూడ దాదాపు ఖాయమైనట్టే. అంటే ఒకే ఒక్క సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఈ చిన్న హీరోకు సెట్స్ మీద మూడు సినిమాలు చర్చల దశలో రెండు ఇలా మొత్తంగా ఐదు సినిమాలు చేతిలో ఉన్నాయన్నమాట. వాటిలో కనీసం రెండు సినిమాలు హిట్టయినా కూడ అతనికి డిమాండ్ డబుల్ కావడం ఖాయం.