Kiara Advani : అందాల బొమ్మ కియారా అద్వానీ కాస్తా ‘బూతు’ బొమ్మ అయిపోయింది కానీ.!

Kiara Advani : ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ముద్దుగుమ్మ కైరా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్ని బుట్టలో పడేసుకుందీ బ్యూటీ. తన అందం, అభినయంతో నిజంగానే తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ వెంటనే ‘వినయ విధేయ రామ’ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించేసిందీ హాట్ అండ్ క్యూట్ కైరా అద్వానీ.

అయితే, తెలుగులో ‘వినయ విధేయ రామ’ సినిమా ఆశించి ఫలితాన్ని అందించలేదు కైరాకి. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అనుకోకుండా ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది కైరా అద్వానీ. అడల్ట్ బేస్ కాన్సెప్ట్ వున్న వెబ్ సిరీస్ అది. ఆ వెబ్ సిరీస్‌తో కైరా చాలా విమర్శలు ఫేస్ చేసింది.

‘ఏ’ కేటగిరి హీరోయిన్ అనే ముద్ర వేయించేసుకుంది.

కానీ, ఆ ఇమేజే కైరా అద్వానీకి స్టార్‌డమ్ కట్టబెట్టింది కూడా. ఆ తర్వాత బాలీవుడ్‌లో కైరా అద్వానీ వెనక్కి తిరిగి చూసిందే లేదు. వరుసగా క్రేజీ ఆఫర్లు, వరుస సక్సెస్‌లు.. దశ తిరిగిపోయిందంతే.

దాంతో ‘ఏ’ కేటగిరి ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయిపోయి, సెన్సేషనల్ హీరోయిన్ ఇమేజ్ ఆమెను వరించింది.

ప్రసుత్తం కైరా అద్వానీ, శంకర్ – రామ్ చరణ్ కాంబో మూవీలో నటిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా కైరా అద్వానీని నటిగా ఇంకో మెట్టు పైకెక్కిస్తుందని ఆశిద్దాం.