Kiara- Advani: ఆడి కారుతో కియారా అద్వానీ.. ఆ కారు ఖరీదు ఎంతంటే?

Kiara- Advani: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న కియారా అద్వానీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక సూపర్ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె దగ్గర బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్-5, మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్, బీఎమ్‌డబ్ల్యూ 530డీ బ్రాండ్‌లకు చెందిన కార్లు ఉండగా తాజాగా ఆడి సంస్థకు సంబంధించి ఆడి ఏ8 లగ్జరీ సెడాన్‌ కారు కొనుగోలు చేసింది. భారత మార్కెట్‌లో ఆడి ఈ బ్రాండ్ కారును 2020లో విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో ఆ కారు ప్రారంభ ధర రూ.1.56కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా ఆడి సమస్థ తమ కంపెనీ కారుతో కియారా అద్వానీ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  ‘‘ఆడి కారును నడపడానికి కియారా అడ్వాణీని స్వాగతిస్తున్నాం ’’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం కియారా అద్వానీ కొత్త కారుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కియారా అద్వాని శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి RC15 సినిమాల్లో నటిస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకే ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ తేజ్ తో కలిసి వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.