ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ప్రజలు కూడా కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా వల్ల లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. ఉద్యోగాలు పోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. వ్యాపారం చేద్దామన్నా డబ్బులు లేవు. దీంతో ఏం చేయలేని స్థితిలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్లకు సువర్ణావకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయంతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు.
బిజినెస్ వరకు ఓకే కానీ.. ఏ బిజినెస్ చేయాలి.. అనే దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే తొందరపడి ఏదో ఒక బిజినెస్ చేయడం కాదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ లో డిమాండ్ ను బట్టి వ్యాపారాన్ని ఎంచుకోవాలి. అలా అయితే.. తేనె బిజినెస్ చేయొచ్చు. అవును.. హనీ బిజినెస్.
మీకు తెలుసా? ప్రపంచంలోనే తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా మన దేశంలో తేనె ఉత్పత్తికి చాలా ప్రాధాన్యత ఇస్తోంది. తేనె ఉత్పత్తి కోసం 500 కోట్లను కేటాయించింది.
ఈ బిజినెస్ చేయాలనుకుంటే.. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందిస్తుంది. దాని కోసం తేనె ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాని కోసం.. ఖాదీ గ్రామోద్యోగ్ స్కీమ్ కింద కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. దీని కింద 65 శాతం వరకు రుణాన్ని పొందొచ్చు. దాంట్లో 25 శాతం సబ్సిడీ లభిస్తుంది. ప్లాంటు కోసం 10 శాతం ఖర్చు భరిస్తే చాలు. మిగితాదంతా ప్రభుత్వమే అందిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్ లో తేనెకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. సంవత్సరానికి కనీసం 20 వేల కిలోల తేనెను ఉత్పత్తి చేయగలిగినా… ఖర్చులు పోను సంవత్సరానికి కనీసం 14 లక్షలు మిగులుతాయి. అంటే.. నెలకు లక్షపైనే సంపాదించినట్టే.