కేజీఎఫ్” మాస్టర్స్ తో చరణ్ సినిమాలో అదిరే సీక్వెన్స్ ప్లాన్ చేసిన శంకర్!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఐకానిక్ దర్శకుడు శంకర్ ల సినిమా కూడా ఒకటి. మొదటి నుంచీ ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. అయ్యి ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసినట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసేసారు.

అయితే ఈ షెడ్యూల్ లో ఇండియన్ సినిమా దగ్గర భారీ ఏక్షన్ సినిమా అయ్యినటువంటి “కేజీఎఫ్” సినిమా స్టంట్ మాస్టర్స్ అన్బిరువి లు కీలక ఏక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సినిమా తర్వాత వీళ్ళ ఫేమ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఇక శంకర్ కూడా తన సినిమాలో హాలీవుడ్ లెవెల్ ఏక్షన్ ని మిస్ చెయ్యకుండా పెడతారు. మరి చరణ్ తో ఏ లెవెల్ ఏక్షన్ ని చూపించారో చూడాలి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు తన బ్యానర్ నుంచి 50 వ ప్రాజెక్ట్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.