KGF 2 : సినిమా సూపర్ హిట్టు.. కానీ,  శ్రీనిధి శెట్టి పాపులారిటీ సంగతేంటీ.!

KGF 2 : ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’, సినిమాతో సినీలోకానికి పరిచమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. తొలి సిరీస్ సూపర్ హిట్టవ్వడంతో, హీరోయన్‌ని మార్చకుండా అలాగే కంటిన్యూ చేసేశారు రెండో సిరీస్‌కి కూడా. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ కూడా రిలీజైంది. అంతకు మించిన అంచనాల్ని అందుకుంటూ దూసుకెళ్తోంది.
అంతా బాగానే వుంది. కానీ, ‘కేజీఎఫ్ 2’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. తొలి పార్ట్‌లోనే హ్యూజ్ ఆటిట్యూడ్ ప్రదర్శించిందీ అమ్మడు.
అవసరమున్నంత మేర గ్లామర్ షేడ్స్ కూడా ఓకే అనిపించేసింది. కానీ, అంతంత మాత్రం పేరు తెచ్చుకుంది.
ఒక్క సూపర్ హిట్ కొడితే చాలు, ధూమ్ ధామ్ పేరు మార్మోగిపోతుంటుంది హీరోయిన్లకు. అలాంటిది ఎందుకో మరి, శ్రీనిధి శెట్టి టార్గెట్ కావడం లేదు. వరుస పెట్టి ఆఫర్లు దక్కించుకోవాలి.
అలాంటిది అప్పుడు మొదటి ఛాప్టర్, ఇప్పుడు రెండో ఛాప్టర్ అంతే. పెద్దగా మేకర్ల దృష్టిని ఆకర్షించలేకపోయిందీ అమ్మడు. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్స‌్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ వుండదు. అలాంటిది శ్రీనిధికి మంచి ప్లేస్‌మెంటే దొరికింది సినిమాలో.
మంచి స్కోపున్న పాత్రే ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు కానీ, ఈ సారి శ్రీనిధి లైట్ తీస్కోలేదు. తనను తాను ప్రమోట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
ఆ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా, గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసింది. లైట్ క్రీమ్ కలర్ ప్రింటెడ్ గాగ్రా చోళీలో వయ్యారాలు పోతూ ఫోటోలకి పోజిచ్చింది.
ఆ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయిప్పుడు.