KGF Chapter 2 : నైజాంలో దుమ్ము రేపుతున్న ‘కేజీఎఫ్ 2’.. కారణమిదే.!

KGF Chapter 2 :  నైజాంలో ‘కేజీఎఫ్ 2’ సందడి మామూలుగా లేదు. నిజానికి ‘బాహుబలి’ సినిమా గురించి ఎంతలా మాట్లాడుకున్నారో అంతకు మించి ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’ గురించి మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ టాక్ కూడా అంతేలా వినిపించింది.

ఎట్టకేలకు సినిమా రిలీజైంది. ప్రీ రిలీజ్ బజ్‌కి ఎంత మాత్రమూ తగ్గకుండా, సినిమా అంచనాల్ని అందేసుకుంది. ఫస్ట్ టాక్ అదిరిపోయింది. ఇక నైజాం విషయానికి వస్తే, స్ర్టెయిట్ తెలుగు సినిమాలా ‘కేజీఎఫ్ 2’ని నెత్తిన పెట్టేసుకుంటున్నారు టాలీవుడ్ జనం.

అందుకు ముఖ్య కారణం, రామ్ చరణ్, ఎన్టీయారే. ‘కేజీఎఫ్ 2’ హీరో అయిన యష్‌కి చరణ్; ఎన్టీయార్‌తో మంచి స్నేహం వుంది. రిలీజ్‌కి ముందే ఈ ఇద్దరు హీరోలతోనూ బాగా మింగిల్ అయ్యాడు హీరో యష్. ఓ పక్క ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఇంకా తగ్గనే లేదు.

‘ఆర్ఆర్ఆర్’‌తో ఇటు చరణ్ ఫ్యాన్స్, అటు ఎన్టీయార్ ఫ్యాన్స్ ఓ రకమైన పూనకాల్లో వున్నారు. ఇలాంటి తరుణంలో యష్ నటించిన ‘కేజీఎఫ్ 2’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్టీయార్, చరణ్.. యష్‌ని సపోర్ట్ చేయడంతో, ‘కేజీఎఫ్ 2’కి అమాంతం క్రేజ్ పెరగిందని చెప్పక తప్పదు నైజాంలో.

ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. సినిమాని ఓన్ చేసుకున్నారు. అదే ఈ సినిమా సక్సెస్ అవడానికి కారణమైంది. లాంగ్ వీకెండ్.. పాజిటివ్ టాక్.. మెగా, ఎన్టీయార్ కాంపౌండ్ ఫుల్ సపోర్ట్.. అన్నీ వెరసి ‘కేజీఎఫ్ 2’ నైజాంలో దుమ్ము దులిపేయడం ఖాయం అంతే.!