KGF Chapter 2 : వసూళ్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు సెట్ చేసిన “కేజీఎఫ్ 2”.!

KGF Chapter 2 :  భారీ వసూళ్లతో ఇప్పుడు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్న మరో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ డొమెస్టిక్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో రాకింగ్ స్టార్ యష్ తో చేసిన ఈ కన్నడ సినిమా ఇప్పుడు ఇండియన్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుంది.
ముఖ్యంగా అంతా అనుకుంటున్నట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో సినిమా సొంత భాష అయిన కర్ణాటక కన్నా ఎక్కువ వసూళ్లు అందుకుంటూ దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా అయితే వసూళ్ల పరంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు నమోదు చేసినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు అందుకున్న పర భాషా సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 2.0 సినిమా 54 కోట్లకి పైగా షేర్ లైఫ్ టైం కలెక్షన్స్ తో ఉండగా ఇప్పుడు ఈ ఆల్ టైం రికార్డుని కేజీఎఫ్ 2 సినిమా కేవలం ఐదు అంటే ఐదు రోజుల్లోనే బ్రేక్ చేసేసిందట. మరి ఈ ఐదు రోజుల్లో కేజీఎఫ్ సినిమాకి 58 కోట్లు షేర్ వచ్చింది.
దీనితో తెలుగులో అత్యధిక వసూళ్లు అందుకున్న డబ్బింగ్ సినిమాగా ఇది ఇప్పుడు ఆల్ టైం రికార్డు అందుకుంది. మరి అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో సింపుల్ గా 70 కోట్లు షేర్ రాబడుతుంది అని కూడా ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా హోంబలే సినిమాస్ వారి సారథ్యంలో నిర్మాణం జరిగింది.