Kgf chapter 2 :బిగ్ బజ్ : “కేజీఎఫ్ చాప్టర్ 2” కి అక్కడ భారీ దెబ్బ తప్పదా?

Kgf chapter 2 :ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలు మాత్రం జస్ట్ వారాల వ్యవధిలోనే భారీ సినిమాలు ఉన్నాయని చెప్పాలి. మినిమమ్ బాగా చూస్తే కనుక రెండేసి వారాల్లోనే మన టాలీవుడ్ నుంచి కానీ సౌత్ ఇండియన్ సినిమా నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు అందులోని మోస్ట్ అవైటెడ్ సినిమాలే ఉన్నాయి. కానీ వాటిలో చాలా మేర కొన్ని సినిమాలకి అంతగా పోటీ అయితే వేటికి లేదు.

కానీ కన్నడ నుంచి వస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” కి గట్టి పోటీ తప్పేలా లేదనిపిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాని వచ్చే ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికి కూడా మేకర్స్ అదే డేట్ కి ఫిక్స్ అయ్యి ఉన్నారు.

మరి ఇదిలా ఉండగా సరిగ్గా ఇదే డేట్ కి మాత్రం తమిళ్ లో కేజీఎఫ్ కి దెబ్బ తప్పేలా లేదని చెప్పాలి. ఎందుకంటే అదే రోజు సరిగ్గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన “బీస్ట్” ని కూడా ఫిక్స్ చేశారట. అంటే ఇప్పుడు మేకర్స్ అదే రోజున రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

నార్మల్ గా అయితే కేజీఎఫ్ 2 పై ఉన్న హైప్ కి మరే హీరో కూడా తన సినిమా తీసుకొచ్చే సాహసం చెయ్యరు. కానీ విజయ్ ఆ పని చేస్తున్నాడు. అలా అని కేజీఎఫ్ కి తక్కువ హవా కూడా లేదు. తమిళ్ తో పాటుగా అన్ని ఇండస్ట్రీలలో ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఫైనల్ గా మాత్రం ఒకేరోజు విడుదల ఉంటే తమిళ నాట కేజీఎఫ్ కె దెబ్బ పడుతుంది. విజయ్ క్రేజ్ అక్కడ 300 కోట్లు అంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది ఒకే రోజు అంటే అది పెద్ద దెబ్బే అవుతుందని చెప్పాలి. మరి వేచి చూడాలి ఏమవుతుందో ఏంటో.