KGF Chapter 2 Bookings Update : ఏపీలో “కేజీఎఫ్ 2” బుకింగ్స్ పై ఇంట్రెస్టింగ్ సమాచారం మీకోసం..!

KGF Chapter 2 Bookings Update

KGF Chapter 2 Bookings Update :  ఇప్పుడు మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

అయితే ఇపుడు ఈ చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా ఒక్కో ఇండస్ట్రీ ని చుట్టేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఉన్న డిమాండ్ పట్ల మన తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఆడియెన్స్ చూస్తున్నారు.

కానీ మన దగ్గర అందులోని ఏపీలో పరిస్థితులు కాస్త వేరే కదా అందుకే ఇంకా మన దగ్గర తప్ప మిగతా అన్ని చోట్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఏపీలో మరియు తెలంగాణాలో బుకింగ్స్ అయితే బహుశా సోమవారం నుంచి తెరుచుకోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ఇంకో పక్క ఈ సినిమాకి ధరలు కూడా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంతమేర నిజముందో వేచి చూడాలి. అలాగే ఒకవేళ పెంచితే ఎంత పెంచుతారో అనేవి కూడా తెలియాల్సి ఉందొ. సో ఈ సినిమా బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ అయితే సోమవారం వరకు ఆగక తప్పదు.