కేజీఎఫ్ 2 టీజర్ వచ్చేది ఆ రోజే !

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది. అంతేకాదు కన్నడ సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.

ఈ సినిమాను 70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరి చేత ప్రశంసలు కురిపించుకుంది.

ఇక కేజిఎఫ్ మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో భాగాన్ని ‌ ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు ఇందలో నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్‌తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు.

కేజీఎఫ్ 2 సినిమా చేస్తూనే ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా టీజర్‌ను వచ్చే యేడాది జనవరి 8న యశ్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు.కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీజర్ విడుదల తర్వాత కేజీఎఫ్ 2పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు