KGF 2 sensational Collection : “కేజీఎఫ్ 2” వసూళ్ళ బ్లాస్ట్..కేవలం బుకింగ్స్ తోనే ఇండియన్ రికార్డ్.!

KGF 2 sensational Collection : ఎన్నో అంచనాలు నడుమ లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యిన భారీ ఏక్షన్ డ్రామా “కేజీఎఫ్ చాప్టర్ 2”. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ సినిమా ఎన్నో ఏళ్ల నుంచి ఆసక్తి గా ఎదురు చూస్తుండగా వేరే లెవెల్ హైప్ నడుమ విడుదల అయ్యింది.
అయితే ఈ సినిమా డెఫినెట్ గా ఇండియా ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకుంటుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేయగా ఈ సినిమా ఇంకా ఫస్ట్ డే వసూళ్ళ వివరాలు రాక ముందే ఒక్క ఇండియా లోనే కేవలం ఆన్లైన్ బుకింగ్స్ భారీ రికార్డు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కేవలం ఈ బుకింగ్స్ తో టోటల్ గా ఇండియా లో అన్ని భాషల్లో కలిపి 72 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అట. ఇది ఒక ఊహించని రికార్డు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఇంకా చాలా చోట్ల ఈ సినిమాకి సరైన ప్రమోషన్ లు కూద్వె చేయలేదు కానీ అయినా ఈ రేంజ్ వసూళ్లు అంటే సంచలనమే అని చెప్పాలి.
ఇక ఓవరాల్ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి. RRR ఓపెనింగ్స్ బడ్డలయ్యాయా లేదా అనేది కూడా చూడాలి అని అందరూ ఉబలాట పడుతున్నారు.